తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా గడచిన పది సంవత్సరాలలో పేదల ఇండ్ల నిర్మాణం జరగలేదు. దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్రజల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన ఇండ్లను మంజూరు చేయాలలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మంత్రి పొంగు లేటి ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు మంత్రులు కలిసి కరీంనగర్ వెళ్లారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత జరిగిన సమావేశంలో కూడా మంత్రి పొంగు లేటి హౌసింగ్ కు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించి, అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇండ్లను పొందడానికి అర్హత కలిగి ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పధకం కింద కనీసం 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలి” అని మంత్రి పొంగులేటి కోరారు