ప్రస్తుతం రాష్ట్రంలో ఫార్ములా ఈ రేసు కేసు గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తనపై నమోదైన కేసు అక్రమమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతుండగా.. ఈ కేసు కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేవేసింది. దీంతో తను న్యాయం పోరాటం చేస్తానని, సుప్రీంకోర్టులో తిరిగి అప్పీల్ చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు విచారణకు హాజరుకావాలని అటు ఏసీబీ, ఈడీ కేటీఆర్‌కు నోటీసులు పంపింది.
తాజాగా ఫార్ములా ఈ రేసులో అవినీతి జరగలేదని స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్న వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. స్వయంగా మంత్రి అవినీతి జరగలేదని చెబుతున్నా కాంగ్రెస్, బీజేపీ సన్నాసులు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ తాత్కాలికంగా శునకానందం పొందుతున్నారని, ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు కోసమే చిట్టి నాయుడు పెట్టిన అక్రమ కేసు అని గులాబీ పార్టీ ఆరోపిస్తున్నది. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని పేర్కొంది.
ఫార్ములా – ఈ లో అవినీతి జరగలేదు అని స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు..
కానీ కాంగ్రెస్, బీజేపీ సన్నాసులు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ తాత్కాలికంగా శునకానందం పొందుతున్నారు.
ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు కోసమే చిట్టి నాయుడు పెట్టిన అక్రమ కేసు.… pic.twitter.com/ArFS1i4k5c
— BRS Party (@BRSparty) January 8, 2025