ధాన్యం కొనుగోలుపై బండి సంజయ్ కి పొన్నం ప్రభాకర్‌ డెడ్‌ లైన్‌..

-

ధాన్యం కొనుగోలు పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి… కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డెడ్‌ లైన్‌ విధించారు. వడ్ల కొనుగోలు విషయం లో
బండి సంజయ్ కు డిసెంబర్ 10 వరకూ డెడ్ లైన్ పెడతున్నామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. మంత్రి గంగుల కమలాకర్‌, ఇతర టీఆర్‌ఎస్‌ నేతలు ఎమ్మెల్సీ రాజకీయాల్లో బిజీ అయ్యారని మండిపడ్డారు. వరి వేయొద్దని ప్రభుత్వ పరంగా ఏమి సూచిస్తున్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


ఉమ్మడి జాబితాలో ఉన్నది ధాన్యం కొనుగోలు విషయమని గుర్తు చేశారు పొన్నం ప్రభాకర్‌. కాబట్టి బీజేపీ ఎంపీగా బండి సంజయ్.. ఖరీఫ్ సంగతి తేల్చాలని…అలానే రబీ పంట విషయం కూడా తెలపాలని డిమాండ్‌ చేశారు. రైతులను పట్టించుకునే పరిస్థితి టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలకు లేదని నిప్పులు చెరిగారు. తెలంగాణ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆగం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం ప్రభాకర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version