చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్ లు ఫెంటాస్టిక్ గా క‌నిపిస్తున్నారు..నేను వెయిటింగ్ : బుట్ట‌బొమ్మ‌

-

సాధార‌ణంగా హీరోయిన్ లు తాము చేసే సినిమాల‌ను త‌ప్ప వేరే సినిమాల‌ను ప‌ట్టించుకోరు. కానీ తాజాగా తాను ఆర్ఆర్ఆర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అంటూ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కామెంట్లు చేసింది. నిన్న ఆర్ఆర్ఆర్ నుండి రామ్ చ‌ర‌ణ్ పోస్ట‌ర్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో అంద‌రిలానే తాను కూడా రాజ‌మౌళి ఎమోష‌నల్ డ్రామాను చూసేందుకు ఎదురు చూస్తున్నా అంటూ పూజా హెగ్డే కామెంట్లు చేసింది.

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ కూడా ఫెంటాస్టిక్ గా క‌నిపిస్తున్నార‌ని….ఒకే స్క్రీన్ పై ఇద్ద‌రినీ చూసేందుకు తాను ఎంత‌గానో వెయిట్ చేస్తున్నాన‌ని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా పూజా హెగ్డే ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన అర‌వింద స‌మేత సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. అదే విధంగా ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధం గా ఉన్నా ఆచార్య సినిమాలోనూ రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా న‌టించింది. మ‌రోవైపు పూజా ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కిన రాధే శ్యామ్ సినిమాలో హీరోయిన్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కూడా విడుద‌లకు సిద్ధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version