టాలీవుడ్ పై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్.?

ముకుందా అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన పూజా హెగ్డే ఆ తర్వాత తన హాట్ హాట్ ఫోటో షూట్లతో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ కు బాగా కలిసి వచ్చింది ఈ అమ్మడికి. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమా అవకాశాలు అందుకుంటోంది.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగు ప్రేక్షకులందరూ సినిమాలను ఎంతగానో ప్రేమిస్తారని ఇక హీరోలను దేవుళ్ళుగా పూజిస్తున్నారు అంటూ పూజా హెగ్డే తెలిపింది. ఇక సినిమా విడుదల అయింది అంటే థియేటర్ వద్దకు పెద్ద పెద్ద డ్రమ్స్ తో వచ్చి భారీగా ఊరేగింపు చేస్తారు అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకు నటిగా ఎదగడానికి టాలీవుడ్ ఎంతగానో ఉపయోగపడిందని.. అందుకే తనకు తెలుగు చిత్ర పరిశ్రమపై ఎప్పుడు అంతకంతకు గౌరవం పెరుగుతూ ఉంటుంది అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.