విడాకులపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్… వెంటనే డిలీట్..!

-

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ విడాకులపై సంచలన ట్వీట్ చేసింది. అయితే ఆ వెంటనే ట్వీట్ ను డిలీట్ చేసింది. అయితే పూనమ్ కౌర్ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేసింది అనేది ప్రశ్నగా మారింది. పూనమ్ తన ట్వీట్ లో … విడాకుల తర్వాత పురుషులకు బాధ ఉండదా అంటూ ప్రశ్నించింది. విడాకులు తీసుకున్న మహిళలు సమాజంలో ఇబ్బందులు పడతారని వారిని మాటలతో భాదిస్తారని రాసుకొచ్చింది. మహిళల వల్లే పురుషులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తుంటాయని సమాజం అంటుందని పూనమ్ కౌర్ పేర్కొంది.

 

Poonam Kaur on divorce

ఇప్పటికీ విడాకుల అంశాన్ని మనం పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్నామా అంటూ ప్రశ్నించింది. విడాకుల విషయంలో మనకు ఖచ్చితమైన దృక్కోణం ఉందా అంటూ ఆమె నిలదీసింది. అయితే పూనమ్ కౌర్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశావు అని నెటిజన్లు ప్రశ్నించారు. దాంతో కొద్దిసేపటికే పూనమ్ కౌర్ ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది. ఇక పలువురు నెటిజన్లు కొంతమంది నటీనటుల పేర్లను ప్రస్తావిస్తూ వారిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసావా అంటూ కామెంట్స్ చేసారు దాంతో పూనమ్ ఆ ట్వీట్ ను డిలీట్ చేసిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version