పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లపై పూనమ్‌ సంచలన ట్వీట్‌ ?

-

సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఓ తలనొప్పి, ఉండకపోతే మరో తలనొప్పి. కొందరు సెలెబ్రిటీలు పెట్టే పోస్ట్‌లకు నెగెటివ్ కామెంట్స్ వస్తాయి. అయితే వాటిని అలా వదిలేస్తే ఓ పది మందే చూస్తారు.. కానీ వాటిని సదరు సెలెబ్రిటీలు హైలెట్ చేస్తే కొన్ని లక్షల మంది చూస్తారు. అవి వార్తల్లోకెక్కుతాయి. ఇందులో టాలీవుడ్‌ నటి పూనమ్ కౌర్ లాంటి కొందరు స్టార్లు.. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. అవి కాస్త పెద్ద బ్రేకింగ్‌ న్యూసు అయిపోతాయి.

అయితే.. నిన్న భీమ్లా నాయక్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్రారంభం అయినప్పటి నుంచి.. పూనమ్‌ కౌర్‌ వరుసగా ట్వీట్లు పెడుతోంది. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ ను టార్గెట్‌ చేస్తూ.. కామెంట్‌ చేసింది. పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లను టార్గెట్‌ చేస్తూ.. వివాద్పద వ్యాఖ్యలు చేసింది పూనమ్‌.

“ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ప్రజలు తమకు నచ్చిన నాయకున్ని ఎన్నికున్నారు. అలాగే.. చాలా రాజకీయ నాయకులు పెళ్లిళ్ల పై దృష్టి పెట్టారు” అంటూ అర్థం కానీ ట్వీట్‌ చేసింది పూనమ్‌. అయితే.. ఈ ట్వీట్‌ పై పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఫైర్‌ అవుతున్నారు. తమ హీరోనే అంటుందని పూనమ్‌ పై మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version