విజయ్ దేవరకొండ హీరోగా.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. విజయ్, పూరీ జగన్నాథ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ వేద్దామనుకున్న పూరీ జగన్నాథ్ కు నిరాశే ఎదురైంది.
కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పూరి జగన్నాథ్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారారు. సినిమాలు లేక ఖాళీగా ఉన్న పూరీ తన యూట్యూబ్ ఛానల్ పూరి మ్యూజిక్స్ కొన్ని అంశాలు పంచుకుంటున్నారు. దీని కోసం ఎదురుచూసే అభిమానుల కూడా ఉన్నారు.గతంలో ఎన్నో ఆసక్తిరమైన విషయాలను చెప్పిన పూరి..ఇప్పుడు ప్రేమికుల కోసం మంచి టాపిక్ ఎంచుకున్నాడు.
చిన్న వయస్సులో ప్రేమించి తప్పుచేయొద్దని ఆ చిన్న వయస్సులో మీ మీద మైండ్ లో రిలీజ్ అయ్యే కెమికల్స్ ప్రబావం ఉంటుందని తెలిపాడు. పాతికేళ్ల వయసు దాటితే కొంత బుద్ది , జ్ఞానం వస్తాయి. పాతికలోపు వాళ్లకు అస్సలు బుర్ర పనిచేయదు. ఒక పక్క కెమికల్స్ మనల్ని మోసం చేస్తుంటే.. ఏదో ఒక లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ అవుతుంది. దాన్ని నాలుగు సార్లు చూడడం.. అవే పాటలు పెట్టుకుని వింటూ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం.. ఇది జోక్ కాదు. ఇలాగే ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి. దయచేసి తప్పులు చేయకండి మెచ్యూర్ గా ఆలోచించండి అంటూ చెప్పుకొచ్చారు.