వసంతకు దేవినేని సవాల్..తాడేపల్లిలో ఆ రోజు ఏం జరిగింది?

-

ఇటీవల మైలవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఇక్కడ అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తుండగా, అటు టీడీపీలో కూడా అదే స్థాయిలో రచ్చ జరుగుతుంది. అలాగే వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌లకు పెద్దగా పడటం లేదు. ఇక్కడ జోగి పెత్తనం చేస్తున్నారని, అలాగా వసంతపై నెగిటివ్‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వసంత వర్గం ఫైర్ అవుతుంది.

ఇక మైలవరం సీటు జోగిదే అని, వసంత ఇంకా తప్పుకోవాల్సిందే అని చెప్పి జోగి వర్గం అంటుంది. అటు కొన్ని కాంట్రాక్టుల విషయంలో వసంత-జోగి వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. వీరి పంచాయితీ జగన్ వద్దకు కూడా వెళ్లింది. ఇక వీరిద్దరు తనని కలవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. అటు టీడీపీలో దేవినేని ఉమాకు వ్యతిరేకంగా బొమ్మసాని సుబ్బారావు పనిచేస్తున్నారు. ఇలా రెండు పార్టీల్లో రచ్చ ఉంది.

అయితే ఎంత లేదు అనుకున్న ప్రస్తుతం అక్కడ రాజకీయంగా వసంతకు నెగిటివ్ ఎక్కువ ఉండగా, దేవినేనికి పాజిటివ్ కనిపిస్తోంది. రాజకీయంగా దేవినేని కాస్త పై చేయి సాధిస్తున్నారు. ఇదే సమయంలో కొండపల్లి మున్సిపల్ కమిషనర్ వ్యవహారం వివాదాస్పదం అవుతుంది. కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ చేతుల్లో ఉంది..అయితే టీడీపీ కార్పొరేటర్లకు చెప్పకుండా మున్సిపల్ కమిషనర్, వైసీపీ వాళ్ళు కొండపల్లి పరిధిలో కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిపై టీడీపీ కార్పొరేటర్లు నిరసనలు చేస్తున్నారు.

అలాగే అవినీతిపరుడైన కొండపల్లి మున్సిపల్ కమిషనర్‌ను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కోట్ల రూపాయలు గడిస్తున్నారని దేవినేని ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతి అంతా ముఖ్యమంత్రి ముందే ఆ పార్టీ కార్యకర్తలే బయట పెట్టారన్నారు. తాడేపల్లి కొంపలో ఆరోజు రెండు గంటలు ఏం జరిగిందో చెప్పే దమ్ము కృష్ణ ప్రసాద్ ఉందా అని ప్రశ్నించారు.

అలాగే ఒకేరోజు మూడు పార్టీలు మార్చిన బతుకులు ఎమ్మెల్యేవి అని, టీడీపీ ప్రభంజనంలో వసంత కృష్ణ ప్రసాద్ లాంటి రాజకీయ వ్యభిచారులు ఊసరవెల్లులు కొట్టుకుపోవడం ఖాయమని దేవినేని ఉమా తీవ్ర విమర్శలు చేశారు. మొత్తానికి మైలవరంలో పెద్ద రచ్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version