ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ 9 ఈరోజు సాయంత్రం గ్రాండ్ లాంచ్ కానుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ 8 సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఈరోజు నుంచి బిగ్బాస్ 9 రియాల్టీ షో ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం గ్రాండ్ లాంచ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్లు అడుగుపెట్టనున్నారు. ఇందులో సెలబ్రిటీ కంటెస్టెంట్లు 9 మంది, కామనర్స్ 6 మంది ఉన్నారు. మొత్తం 15 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ కు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

దీంతో ఈరోజు నుంచి టీవీలలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈరోజు లాంచ్ ఈవెంట్ పూర్తయిన తర్వాత రేపటి నుంచి బిగ్ బాస్ హౌస్ లో జరిగే సన్నివేశాలు టీవీలలో చూడవచ్చు. బిగ్ బాస్ హౌస్ లోని 15 మందిలో ఇమ్మానుయేల్, రీతు చౌదరి, తనుజ గౌడ, శ్రష్టి, సుమన్ శెట్టి, ఆశ సైనీ, భరణి ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. దీనితోపాటు మిగతా 6 మందికి సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నారు. మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజ, ఆర్మీ పవన్ కళ్యాణ్, మనీష్, ప్రియా, డిమాన్ పవన్ అనే సామాన్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ఈ విషయం పైన క్లారిటీ రానుంది. కాగా ఈ షో కోసం అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు.