అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు అతడినీ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఆయనకు కోర్టు నిన్న 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అంటే మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు.
జనసేన నాయకుడు జోగినేని మణి 2025 ఫిబ్రవరి 24వ తేదీన పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోసానిపై 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లో ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి పోసానిని ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పవన్ ను వ్యక్తిగతంగా దూషించడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతితోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాట్లాడిన మాటలు అన్ని కూడా సజ్జల కొడుకు భార్గవరెడ్డి సోషల్ మీడియాల్లో వైరల్ చేసేవాడని పోసాని రిమాండ్‌లో వెల్లడించారు. ఈ మేరకు పోసాని చెప్పిన అంశాలతో రిమాండ్ రిపోర్టును పోలీసులు రైల్వే కోడూరు కోర్టుకు సమర్పించారు.