లక్ష రూపాయలతో ప్రతి నెలా రూ.550..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. పోస్టాఫీసు కూడా స్కీమ్స్ ని అందిస్తుంది. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. స్థిరమైన వడ్డీ రేట్లు ఈ స్కీమ్స్ తో పొందొచ్చు. ప్రతి నెలా ఆదాయం అందించే పథకాలు కూడా పోస్టాఫీసుల్లో ఉన్నాయి. వాటిలో పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒకటి. దీనిలో కొంత మొత్తాన్ని పెడితే నెలవారీ ఆదాయాన్ని పొందొచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ కాలం వచ్చేసి ఐదేళ్లు. ఆ తరవాత మరో ఐదేళ్లు ఈ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేసుకోచ్చు. ఐదేళ్ల తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంతో పాటు స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. పోస్టాఫీసు స్కీమ్‌లో వార్షిక వడ్డీ రేటు 6.6 శాతంగా వుంది. ఈ స్కీమ్ లో కనుక మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే…

ఐదేళ్ల తర్వాత 6.6 శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ.6600 మొత్తం వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని ఏడాది పాటు 12 నెలలు చెల్లిస్తారు. నెలకు సుమారు రూ.550 వస్తాయి. దీనితో మీరు ప్రతీ నెలా కూడా రూ.550 పొందవచ్చు. ఈ స్కీమ్ లో జాయిన్ అయ్యి కేవలం రూ.1000తో ఖాతాని తెరుచుకోవచ్చు.

ఈ పధకానికి ఎవరు అర్హులు అన్నది చూస్తే.. 18 ఏళ్లు వయసు దాటిన ఎవరైనా ఈ పథకానికి అర్హులు. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్లను ఓపెన్ చేసుకోచ్చు. ముగ్గురు అకౌంట్ హోల్డర్స్‌తో కలిసి కూడా ఒక వ్యక్తి అకౌంట్‌ను తెరవవచ్చు. సింగిల్ అకౌంట్ ద్వారా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. జాయింట్ అకౌంట్ ద్వారా రూ.9 లక్షల వరకు పెట్టచ్చు. పన్ను ప్రయోజనాలని కూడా ఈ స్కీమ్ లో చేరిన వారు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version