BREAKING: నిరుద్యోగులకు షాక్.. గ్రూప్-4లో తగ్గిన 1129 పోస్టులు

-

9,168 గ్రూప్-4 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ ఇవ్వగా.. సైట్లో 8039 పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. 1129 పోస్టులను తగ్గించేసింది. పంచాయతీరాజ్ విభాగంలో 1245 పోస్టులకు గాను కొన్నింటికి మాత్రమే ఆ శాఖ నుంచి ప్రతిపాదనలు అందాయి. మిగిలిన వాటి విషయంలో స్పష్టత లేకపోవడమే పోస్టుల తగ్గింపుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు నిన్న ఉదయం నుంచే అప్లికేషన్లు ప్రారంభం కావాల్సి ఉండగా.. అర్ధరాత్రి నుంచి షురూ అయ్యాయి. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా వచ్చేస్తున్నాయి.

ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 4 రాగ.. తాజాగా గ్రూప్ 2 ప్రకటన కూడా విడుదలైంది. మరోవైపు పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు గ్రూప్ 4 దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. https://tspsc.gov.in/ లింక్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఓటీఆర్ తప్పనిసరిగా ఉండాలి. అయితే నిన్న.. గ్రూప్-3 నోటిఫికేషన్ ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. అంతేకాకుండా.. స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ విడుదల చేసింది మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version