అప్పు మరణంపై అసభ్యకర పోస్టులు… యువకుడి అరెస్ట్..!

-

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ నెల 29న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. జిమ్ చేస్తున్న సమయంలో తీవ్రమైన గుండెపోటు రాగా పునీత్ రాజ్ కుమార్ మరణించారు. దాంతో కర్ణాటక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మద్యం దుకాణాలను సైతం మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పటి నుండి ఓ యువకుడు మద్యం బాటిల్స్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం ప్రారంభించాడు.

ఈరోజు ఆపుతారు రేపటి నుంచి మమ్మల్ని ఎవడు ఆపాలి… రేపటి నుండి పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్ద అంటూ అవమానకర రీతిలో యువకుడు పోస్టులు పెట్టాడు. అయితే దీనిని పలువురు పునీత్ రాజ్ కుమార్ అభిమానులు సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో సైబర్ పోలీసులు యువకుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. అంతేకాకుండా 1800 మంది విద్యార్థులను చదివిస్తున్న తన ట్రస్టు ద్వారా ఎన్నో సేవలందిస్తున్న పునీత్ రాజ్ కుమార్ పై అసభ్యకర పోస్టులు పెట్టడంపై పునీత్ అభిమానులతోపాటు ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version