మన పాలకులు ఎన్ని వేల కోట్లు వృథా చేశారో? ఆర్ఎస్ ప్రవీణ్ మండిపాటు

-

అధికార టీఆర్‌ఎస్‌పై విమర్శలు సంధించే బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఈసారి బీజేపీని కూడా అరుసుకున్నారు.ఒకవైపు ఈటల రాజేందర్‌ గెలుపును ప్రశంసిస్తూనే మరోవైపు టీఆర్‌ఎస్, బీజేపీ విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయడంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా టీఆర్‌ఎస్ పాలకుల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. అహంకారం, కక్షతో వ్యవహరించి టీఆర్‌ఎస్‌కు కర్రు కాల్చి వాత పెట్టి బహుజన బిడ్డ ఈటల రాజేందర్‌‌ను మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందకు హుజూరాబాద్ ప్రజలకు ధన్యవదాలు తెలిపారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరించినా తెలంగాణ ఇకపైన లొంగదు గాక లొంగదు అంటూ హెచ్చరించారు.

ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలు రెండు కూడా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశాయని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఓటర్లను కొనుగోలు చేయడం కోసం టీఆర్‌ఎస్, బీజేపీలు రూ.వేల కోట్ల ప్రభుత్వ, ప్రైవేటు ధనాన్ని ఖర్చు చేశారని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికలో ఖర్చు చేసిన రూ.వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగకరమైన ఆస్తులను సృష్టించడానికి వెచ్చించి ఉండాల్సిందిగా అభిప్రాయపడ్డారు. మన పాలకుల ఎన్నికల ఖర్చు రూపంలో ఎన్ని వేల కోట్లను వృథా చేశారో మనకు తెలియదు అన్నారు. #TakeBackTelangana అంటూ ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేశారు.

ఎన్నికల కోసం రూ. వేల కోట్లు వృథా చేయడం కంటే ఎలాంటి ఆస్తులను కూడ బెట్టవచ్చో ఆర్‌ఎస్ కూమార్ తెలిపారు. పేదల కోసం రూ.1000కోట్లు ఎలా ఖర్చు పెట్టాలి అంటూ లిస్ట్‌ను పోస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version