ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రెండు ధర్మల్ పవర్ ప్లాంట్ ల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కరెంటు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో నోడు సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో… నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు దశలవారీగా విద్యుత్ సరఫరాలో కోత విధించారు. ప్రతి గ్రామానికి కనీసం రెండు గంటలపాటు రొటేషన్ పద్ధతిలో విద్యుత్ సరఫరా చేయడంతోపాటు… పరిశ్రమలు అలాగే వ్యవసాయ కనెక్షన్లకు కోతలు విధించారు.
ఆంధ్రప్రదేశ్ జెన్కోకు చెందిన కృష్ణపట్నం 800 మెగావాట్లు, విజయవాడ వీటీపీఎస్ లో 500 మెగావాట్ల సామర్థ్యమున్న ప్లాంట్ల లో సాంకేతిక సమస్య తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ లో లీకేజీ రావడంతో ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో విశాఖలోని సింహాద్రి థర్మల్ ప్లాంట్ నుంచి 400 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది.
ఈ కారణంగా గ్రిడ్ కు వచ్చే సుమారు 1500 మెగావాట్ల తగ్గింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సుమారు 140 మిలియన్ యూనిట్లు గా ఉంది. డిమాండ్ కు అనుగుణంగా సరఫరా చేయలేక పోవడంతో కోడలు గురించి చెప్పలేదు. అయితే ఈ సమస్య మరో రెండు మూడు రోజుల పాటు ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది.