పవన్ కల్యాణ్ రిమేక్ చేసిన సినిమాలివే..!

-

పవన్‌ కల్యాణ్‌ అంటే పవర్‌. ఆ పేరే ఒక హోరు. భారీ డైలాగ్‌లు చెప్పకపోయినా.. కళ్లు చెదిరే డ్యాన్స్‌లు చేయకపోయినా.. కేవలం ఆయన కటౌట్‌ కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఉర్రూతలూగుతారు. థియేటర్లలో పండగ చేసుకుంటారు. తెరపై అంత హంగామా చేసే పవన్‌ తెర వెనక సాదాసీదాగా ఉంటారు. అందుకే సగటు సినీ అభిమానితోపాటు ప్రముఖులూ ఆయన్ను ఇష్టపడతారు. పవన్‌ క్రేజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా ఓవర్‌నైట్‌లో జరిగిందేమీ కాదు. అయితే పవన్ నటించిన రిమేక్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి… పవన్ కళ్యాణ్ మొదటిచిత్రం ఇది.. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ పై అల్లు అరవింద్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని హిందీలో అమీర్ ఖాన్ నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాని తెలుగు నేటివిటికి మార్చి తీశారు. సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

గోకులంలో సీత… పవన్ రెండో సినిమాగా ‘గోకులంలో సీత’ అనే సినిమా తెరకెక్కింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో కార్తిక్ హీరోగా నటించిన ”గోకులతిల్ సీతై” సినిమాకు రీమేక్.

సుస్వాగతం… ఇక పవన్ మూడో సినిమాగా ‘సుస్వాగతం’ సినిమా తెరకెక్కింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తమిళంలో విజయ్ హీరోగా నటించిన ”లవ్ టుడే” సినిమాకి రీమేక్.

ఖుషి… ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ హీరో విజయ్ నటించిన ఖుషీ నుంచి రీమేక్ చేశారు. ఈ సినిమా అక్కడి కంటే ఇక్కడే బాగా ఆడింది.

అన్నవరం… చాలా గ్యాప్ తరవాత పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ ఇది అని చెప్పాలి. ఇది కూడా తమిళంలో విజయ్ హీరోగా యాక్ట్ చేసిన ”తిరుపాచి” మూవీకి రీమేకే.

తీన్ మార్ … జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా హిందీలో సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించిన ”లవ్ ఆజ్ కల్” కు రీమేకే.

గబ్బర్ సింగ్…. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హిందీ మూవీ దబాంగ్ నుంచి రీమేక్ చేశారు. కానీ చాలా మార్పులతో ఈ సినిమాని తెరకెక్కించారు.

గోపాల గోపాల… కిషోర్ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో మంచి హిట్టైనా ‘ఓ మై గాడ్’ సినిమాకి ఇది రీమేక్.. వెంకటేష్ మరో హీరోగా నటించాడు.

కాటమరాయుడు… కిశోర్‌కుమార్‌ పార్దసాని(డాలీ) దర్శకత్వం లో పవన్ కల్యాణ్, శ్రుతీ హాసన్, అలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ తదితరులు నటించిన ఈ సినిమా అజిత్ నటించిన ‘వీరం’ కి రీమేక్.

వకీల్ సాబ్…. పవన్ రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా హిందీలో అమితాబ్ చేసిన పింక్ మూవీకి రీమేకే.. వేణు శ్రీరామ్ దర్శకుడు.. పవన్ అన్ని రీమేక్ సినిమాలను చూస్తే అక్కడి కథలని మాత్రమే బేస్ చేసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి హిట్టు కొట్టడానికి రెడీ గా వున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version