పవర్​స్టార్​ 26 ఏళ్ల సినీ జీవితం.. ఈ విషయాలు తెలుసా?

-

టాలీవుడ్​లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనియా ఏంటన్నది చెప్పడానికి స్పెషల్ ఇంట్రోలు అవసరమే లేదు. పవర్ స్టార్ తొలి అడుగు పడి 26ఏళ్లైంది ఈ సుదీర్ఘ కెరియర్​లో పవన్ చేసిన సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

తొలి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి 1996 అక్టోబర్ 11న విడుదలై పాస్ మార్కులు సాధించింది. రెండో మూవీ గోకులంలో సీత చిరంజీవి బర్త్​డే సందర్భంగా 1997 ఆగస్టు 22న రిలీజై సూపర్ హిట్ కొట్టింది. మూడో చిత్రం సుస్వాగతం నూతన సంవత్సరం కానుకగా 1998 జనవరి 1న విడుదలై సూపర్ హిట్​గా నిలిచింది.

నాలుగో మూవీ తొలిప్రేమ 24 జులై 1998లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది పవన్ కెరియర్​కు టర్నింగ్ పాయింట్​గా నిలిచిందీ మూవీ. ఐదో సినిమాగా వచ్చిన తమ్ముడు 15 జులై 1999లో విడుదలై బంపర్ హిట్ కొట్టింది.

ఆరో మూవీ బద్రి 2000 ఏప్రిల్ 20న రిలీజై స్టయిలిష్ బ్లాక్ బస్టర్​గా నిలిచింది పూరీ జగన్నాథ్ ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయమయ్యారు.

 

7వ మూవీగా వచ్చిన ఖుషీ 26 ఏప్రిల్ 2001లో విడుదలై ఇండస్ట్రీని షేక్ చేసింది ఒక లవ్ స్టోరీతో ఇండస్ర్టీ ఆల్ టైమ్ హిట్ కొట్టాడు పవన్.

పవన్ డైరెక్షన్లో వచ్చిన 8వ చిత్రం జానీ 2003 ఏప్రిల్ 25న విడుదలైంది ఎన్నో అంచనాల నడుమ రిలీజై భారీ డిజాస్టర్​గా మిగిలిపోయింది పవన్​కు బ్యాడ్ టైమ్ స్టార్ట్స్.

9వ సినిమా గుడుంబా శంకర్ 2004 సెప్టెంబర్ 10న విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 2005 జనవరి 6న విడుదలైన పదో మూవీ బాలు కూడా ఫ్లాప్ జాబితాలోనే చేరిపోయింది.

pawan kalyan gudumba shankar power star

తర్వాత వచ్చిన బంగారం సినిమా 2006 మే 3న రిలీజై భారీ డిజాస్టర్​గా నిలిచింది పరాజయాలు కొనసాగాయి. సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు చేసిన సిస్టర్ సెంటిమెంట్ ప్రయత్నం కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు 2006 డిసెంబర్ 29న విడుదలైన అన్నవరం చిత్రం కూడా ఫ్లాప్ లిస్టులోనే కలిసిపోయింది.

2008 ఏప్రిల్ 2 రిలీజైన జల్సా ఫ్యాన్స్ కరువు తీర్చింది త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఖుషీ డైరెక్టర్ సూర్య తెరకెక్కించిన కొమరం పులి సినిమా 2010 సెప్టెంబర్ 10న విడుదలైంది కానీ భారీ డిజాస్టర్ అయ్యింది మళ్లీ ఫ్లాప్స్ కంటిన్యూ. 2011 ఏప్రిల్ 14న తీన్మార్ విడుదలైంది పవన్ హార్ట్ కోర్ ఫ్యాన్ బండ్ల గణేశ్ నిర్మించిన ఈ సినిమా కూడా పరాజయం పాలైంది.

ఆ తర్వాత 2011 డిసెంబర్ 9న వచ్చిన పంజా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. ఖుషీ లాంటి హిట్టు పదేళ్ల తర్వాత 2012లో పడింది మే 11న రిలీజైన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఆనందంతో ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్న సినిమా ఇది. 2012 అక్టోబర్ 18న వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం ప్రాంతీయవాదం వివాదాల్లో చిక్కుకుంది పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత 2013 సెప్టెంబర్ 27న రిలీజైన అత్తారింటికి దారేది కూడా బ్లాక్ బస్టర్ హిట్​గా నిలిచింది.

2015లో వెంకటేష్ తో కలిసి గోపాల గోపాల చిత్రం చేశాడు ఇందులో మోడ్రన్ శ్రీకృష్ణుడిగా అలరించాడు పవర్ స్టార్. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ వచ్చాడు ఏప్రిల్ 8న విడుదలైన ఈ చిత్రానికి బలమైన కథ ఎంచుకున్నప్పటికీ కథనంలో లోపాల వల్ల ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

2017లో కాటమరాయుడు చేశాడు మార్చి 24న విడుదలైన ఈ మూవీ యావరేజ్ టాక్​తో నడిచిపోయింది. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారినందున ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నానని ఆఖరి చిత్రం ఇదేనని ప్రకటించిన చిత్రం అజ్ఞాతవాసి 2018 జనవరి 10న విడుదలైన ఈ మూవీ పవన్ కెరియర్లోనే భారీ డిజాస్టర్​గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు.

విరామం తర్వాత 2021లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పవన్ ఏప్రిల్ 9న వకీల్ సాబ్ అంటూ వచ్చాడు బాక్సాఫీస్ ను షేక్ చేశాడు రీఎంట్రీలో బ్లాస్ బస్టర్ హిట్ కొట్టి దుమ్ములేపాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ తో వచ్చి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ కొట్టాడు.

వరుస సినిమాలతో ఊపుమీదున్న పవన్ చేస్తున్న నెక్స్ట్ మూవీ హరిహర వీరమల్లు మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అన్నది చూడాలి. 26 ఏళ్ల సుదీర్ఘ కెరియర్లో హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా తన ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నాడు ఈ అరుదైన నటుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version