బాక్సింగ్ డే టెస్ట్ లో పీకల్లోతు కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ లో కంగారులు కంగారు పడుతున్నారు. అటు రెండో ఇన్నింగ్స్ లో రెచ్చిపోయారు భారత బౌలర్లు. ఇప్పటికే 4 వికెట్ల తో చెలరేగారు బుమ్రా, సిరాజ్ రెండు వికెట్లు. దీంతో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.
10 పరుగుల వ్యవధి లో వెనువెంటనే 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా… బాక్సింగ్ డే టెస్ట్ లో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఇప్పటి వరకు 190 పరుగుల లీడింగ్ లో ఉంది ఆస్ట్రేలియా. ఇక అంతకు ముందు బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఆలౌట్ అయింది. దీంతో భారత్ తొలి ఇన్సింగ్స్ స్కోర్ 369గా నమోదు అయింది. సెంచరీతో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డి..స్పీడ్ గా ఆడే ప్రయత్నంలోనే.. వికెట్ కోల్పోయాడు. బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు… నితీష్ 114, జైస్వాల్ 82, సుందర్ 50 పరుగులు చేశారు.