పిల్లల పేరుపై పీపీఎఫ్‌ అకౌంట్‌ ఇలా ఓపెన్ చేయచ్చు.. ఎంత వస్తాయంటే..?

-

ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బులను సంపాదించేందుకు ఉత్తమమైన మార్గాలను చూస్తున్నారు. పైగా ఎన్నో మార్గాలు కూడా ఉంటున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులని పొందొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా కూడా మనం ఆదాయం పొందొచ్చు. అయితే ప్రతీ తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు, పెళ్లి వంటి వాటి కోసమే డబ్బులను దాస్తుంటారు.

 

ఇలాంటివి దాటడం కష్టం. కానీ పథకాలలో డబ్బులు పెడితే ఆ సందర్భాలలో దాటడం సులభం. అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో పిల్లల పేరుపైన డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యచ్చు. రాబడిని పొందొచ్చు. కొంత డబ్బును పీపీఎఫ్‌ ఖాతాలో డిపాజిట్‌ చెయ్యచ్చు.

అదే విధంగా ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి వయసుతో సంబంధం లేదు. ఏదైనా అధీకృత బ్యాంకుకు వెళ్లి అక్కడ ఫారం నింపి ఓపెన్ చెయ్యచ్చు. పీపీఎఫ్‌ ఖాతాను పిల్లల పేరు మీద ఓపెన్‌ చేస్తే రూ.32 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. మీ పిల్లలకి 18 సంవత్సరాలు వచ్చేసరికి మెచ్యూర్‌ అవుతుంది. కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక ఖాతా ఎలా ఓపెన్ చెయ్యాలో కూడా చూద్దాం.

ముందుగా మీరు పిల్లల పేరుపై పీపీఎఫ్‌ ఖాతాను ఓపెన్ చెయ్యడానికి పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్, రేషన్ కార్డ్ ని అడ్రెస్ ప్రూఫ్ గా ఇవ్వచ్చు.
మైనర్ పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలి. ఒక ఫోటో కూడా అవసరం అవుతుంది.
అకౌంట్ ని ఓపెన్ చేసేటప్పుడు కనీసం రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ చెక్కును ఇవ్వాలి.
ఈ ప్రాసెస్ పూర్తయితే PPF పాస్‌బుక్ ఇస్తారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version