ప్రభాస్ ఫ్యాన్స్: బాసూ మసాలా తగలక చాలా రోజులయ్యింది.!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన లైనప్ చూసి బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా కుళ్ళు కుంటున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రోజెక్ట్ కె, స్పిరిట్ ఇలా ఉంది మనోడి సినిమాల జాబితా ఇవన్ని 2000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలు.ఇది ఎవరికి సాధ్యం కాని రికార్డ్ అందుకే సూపర్ స్టార్ గా ఉన్నాడు.

వీటి అన్నింటి మధ్యలో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.హారర్ కామెడీ నేపథ్యంతో సాగే స్టోరీ ఇది. ఒక థియేటర్ చూట్టూ తిరిగే కథ. ఇక అచ్చమైన తెలుగు సినిమా డైరెక్టర్ ఈ సినిమా తీస్తుండడం తో ఇందులో తెలుగు ప్రేక్షకులు కోరుకునే అన్ని రకాల అంశాలు ఉంటాయని అంటున్నారు.

ఇక్కడే ప్రభాస్ ప్యాన్స్ ఎప్పటినుండో ఆశ పడుతున్న ప్రభాస్ మాస్ ఇమేజ్ తో పాటు మాస్ సాంగ్ కోసం డైరెక్టర్ ను తెగ పాంపెరింగ్ చేస్తున్నారట. ఈ మధ్య కాలంలో ప్రభాస్ హీరో అనే గాని ఎక్కడా మాస్ సాంగ్ కు డాన్స్ చేయలేదు, అన్నీ ఆదర్శంగా డుయెట్ సాంగ్స్ ఉన్నాయి. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ మా హీరో కి మాస్ మసాల సాంగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారట. నిజమే మరి తెలుగు సినిమా హీరో అంటే మాస్ ఐటమ్ సాంగ్ కు ప్రసిద్ది. మీ డిమాండ్ లో న్యాయం ఉంది గురూ..

Read more RELATED
Recommended to you

Exit mobile version