Breaking : సెస్‌ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్‌ సంచలనం

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల (సెస్) కౌంటింగ్ లో గందరగోళం కొనసాగుతోంది. సెస్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగుతోంది. జిల్లాల్లో 12 స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్ లో ఉండగా.. వేములవాడ రూరల్ లో బీజేపీ విజయం సాధించింది. అయితే చాలా సేపటి వరకు అధికారులు ప్రకటించలేదు. దీంతో బీజేపీ ఆందోళనకు దిగింది. పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల్లో అధికారపార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచినప్పటికీ ఫలితాలను తారుమారు చేస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

సెస్ ను నాశనం చేసిన బీఆర్ఎస్ కు ఓట్లేయలేదనే అక్కసుతోనే ఇదంతా చేస్తున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎసోళ్లే ఓట్లేసుకుని, వాళ్లే ఫలితాలు ప్రకటించుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. అలాంటప్పుడు ఎన్నికల నిర్వాహణ, ఫలితాల ప్రకటన పేరుతో జనం సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎందుకని బండి సంజయ్ ప్రశ్నించారు. అధికారం చేతుల్లో ఉందని బీఆర్ఎస్ ఇష్టానుసారం వ్యవహరిస్తోందని బండి మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతల తీరు చూసి జనం అసహ్యించుకుంటున్నా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆటలు చెల్లవన్న ఆయన.. కేసీఆర్ చెంప
చెళ్లుమనిపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చెప్పారు బండి సంజయ్.

సెస్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ రూరల్ ఫలితాలపై గందరగోళం నెలకొంది. బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించారని ఎన్నికల అధికారి మమత ప్రకటించిన కాసేపటికే రీకౌంటింగ్కు ఆదేశించారు. ఫలితంపై అభ్యంతరం వ్యక్తంచేసిన బీఆర్ఎస్ నేతలు రీకౌంటింగ్కు పట్టుబట్టారు. దీంతో 15 నిమిషాల వ్యవధిలోనే ఎన్నికల అధికారి ఓట్లు మళ్లీ లెక్కించాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version