దర్శకుడు వంశీ పైడిపల్లికి ప్రభాస్ చేసిన సాయమిదే..

-

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి..ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తో ‘వారసుడు’ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ లో భారీ తారాగణమే ఉంది. ‘మహర్షి’ వంటి జాతీయ అవార్డు లభించిన చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి చేస్తున్న చిత్రం ‘వారసుడు’.కాగా, దర్శకుడిగా తాను ఎదగడానికి ప్రభాస్ తనకు సాయం చేశాడని వంశీ పైడిపల్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సాయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభాస్-వంశీ పైడిపల్లి కాంబోలో ‘మున్నా’ సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కానీ, వంశీ పైడిపల్లి దర్శకత్వ ప్రతిభను ప్రతీ ఒక్కరు మెచ్చుకున్నారు. కాగా, తను దర్శకుడిగా మారక ముందు తను లైఫ్ లో సెట్ కావడం కోసం ప్రభాస్ చేసిన హెల్ప్ గొప్పదని స్వయంగా వంశీయే చెప్పాడు.

తను ఖాళీగా ఉన్న టైమ్ లో ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజుతో మాట్లాడి..తన స్నేహితుడు అయిన వంశీ పైడిపల్లికి అవకాశం ఇవ్వాలని ప్రభాస్ ఎం.ఎస్.రాజు ను కోరాడని తెలిపాడు. ‘ఒక్కడు’ చిత్రం వంద రోజుల ఫంక్షన్ లో తనను నిర్మాత ఎం.ఎస్.రాజుకు ప్రభాస్ పరిచయం చేశాడని వంశీ పైడిపల్లి గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు వంశీ పైడిపల్లి థాంక్స్ చెప్పారు.

తన స్నేహితుడు అని చూడొద్దని, ఏ పని చెప్పినా చేస్తాడని టాలెంట్ ఉందని ప్రభాస్ ఎం.ఎస్.రాజుకు చెప్పారని వివరించారు. అలా తాను ఎం.ఎస్.రాజు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కాకుండా అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశానని వంశీ పైడిపల్లి తెలిపారు. వంశీ పైడిపల్లి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న ‘వారసుడు’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇందులో కథానాయికగా రష్మిక మందన నటిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version