Prabhas Dual Role : సాహో ‘ లో అదిపెద్ద ట్విస్ట్ అదే..!

-

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్నా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సాహో. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌భాస్ స‌న్నిహితులు ప్ర‌మోద్ – వంశీ రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ ద‌ర్శ‌కుడు. మ‌రో నాలుగు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి దిగుతోన్న సాహో సినిమాపై యావ‌త్ దేశ‌వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంతా సాహో ఫీవ‌ర్‌తో ఊగిపోతున్నారు.

ఈ నెల 30న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న సాహోను ప్ర‌భాస్ అండ్ సాహో టీం ఓ రేంజ్‌లో ప్ర‌మోట్ చేస్తోంది. ఇప్ప‌టికే సాహో ట్రెండ్ సోష‌ల్ మీడియాలో హెరెత్తిపోతోంది. సాహో టిజర్ , ట్రైలర్, సాంగ్స్ దుమ్ము రేపుతున్నాయి. సాహోలో ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్ ఇద్ద‌రూ పోలీస్ ఆఫీస‌ర్లుగానే క‌నిపించ‌నున్నార‌ట‌. వీరిలో ప్ర‌భాస్ రోల్ అండ‌ర్ క‌వ‌ర్ ఆఫ‌రేష‌న్ నేప‌థ్యంలో సాగుతుందంటున్నారు.

సాహో యాక్ష‌న్‌, విల‌న్లు, విజువ‌ల్స్ అన్ని ఒక ఎత్తు అయితే చివ‌ర్లో వ‌చ్చే ట్విస్ట్ అంద‌రికి దిమ్మ‌తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుందంటున్నారు. ఆ ట్విస్ట్ ఏంటో కాదు ప్రభాస్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌డ‌మే అట‌. ఇది క్లైమాక్స్‌లో వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఇక సినిమా శుక్ర‌వారం రిలీజ్ కానున్న నేప‌థ్యంలో గురువారం ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్లు భారీ ఎత్తున వేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గురువారం అర్ధ‌రాత్రి నుంచే సాహో సంద‌డి మొద‌లు కానుంది. ఏపీలో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ల‌కు అనుమ‌తులు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. తెలంగాణ‌లో వీటికి అనుమ‌తులు రావాల్సి ఉందంటున్నారు. సాహోలో ప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్ చేస్తే అది రెండోసారి అవుతుంది… ప్రభాస్ గతంలో బిల్లా సినిమాలో డబల్ రోల్ లో కనిపించారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version