పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసిన ప్రదీప్..!

-

బుల్లితెర లెజెండ్రీ మేల్ యాంకర్స్ లో ఒకరైన ప్రదీప్ మాచిరాజు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి. గత కొన్ని ఏళ్లుగా ఈ వార్తలు వస్తూనే వున్నాయి. ఇంకోసారి సోషల్ మీడియాలో ఈ వార్తలు షికార్లు కొడుతున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య ని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

ప్రదీప్ ఇప్పటిదాకా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేదు ఈ ప్రశ్న ఎదురైనప్పుడల్లా ప్రదీప్ దాటేస్తూ ఉంటాడు. మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ అనే ఈవెంట్ కి సంబంధించిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో ప్రదీప్ పోస్ట్ చేశారు. ప్రదీప్ తన చిన్ననాటి ఫ్రెండ్ ని ప్రేమిస్తున్నారట. ఆమె ని పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news