పవన్ కళ్యాణ్ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయని ఏపీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో పవన్ ఓ అనైతిక రాజకీయవేత్త అన్నారు. ఎన్నికల సమయంలో పొత్తులపై బీజేపీ నాయకత్వంతో చీవాట్లు తిన్నానన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కి మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాటలు విచిత్రంగాను, ఆశ్చర్యకరంగా ఉన్నాయి అన్నారు.
పవన్ కళ్యాణ్ లాంటి అనైతిక రాజకీయవేత్త ఈ రాష్ట్రంలోనే లేడు అని తెలిపారు. ఒక పార్టీతో పొత్తుతో ఉండి మరో పార్టీతో రాజకీయం చేస్తున్నాడని పేర్కొన్నారు. ఓట్లు కొనుక్కోకూడదని చెగువేరాలాగా పవన్ కాకమ్మ కథలు చెప్పాడు. మళ్లీ ఇప్పుడు మాట మార్చి ఓట్లు కొనుక్కోమంటూ తన కేడర్ కి పవన్ లైసెన్స్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అసలు ఆయనకు అయినా అర్థం అవుతుందా అని ప్రశ్నించారు.