ఒక్క రూపాయి అంటే ఎవరికీ కష్టం కాదు. ఎవరైనా సరే ఒక్క రూపాయిని ఈజీగా పెట్టగలరు. అయితే ఇంత తక్కువ అమౌంట్ కి రెండు లక్షలా అని ఆశ్చర్య పోతున్నారా..? అదే కేంద్రం ఇస్తున్న స్కీమ్. మరి ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. మోదీ సర్కార్ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ లో చేరడం వలన మంచిగా ప్రయోజనాన్ని పొందొచ్చు.
ఇది ప్రమాద బీమా స్కీమ్. చాలా తక్కువ ప్రీమియంతోనే అధిక ప్రయోజనం ఉంటుంది. సంవత్సరానికి పన్నెండు రూపాయిలు చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వస్తుంది. నెలకు ఒక్క రూపాయి పొదుపు చేస్తే చాలు. ఏడాదికి రూ.12 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా పొందొచ్చు.
ఇందులో చేరితే ప్రతీ ఏడాది కూడా రూ.12 కట్ అవుతాయి. నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఇవి కట్ అవుతాయి. మే నెల చివరిలో వీటి కట్ చేస్తారు. కనుక అప్పుడు మీ అకౌంట్ లో ఈ అమౌంట్ ఉండేలా చూసుకోండి. ఇక ఎవరు దీనికి అర్హులు అన్నది చూస్తే 18 నుంచి 70 ఏళ్ల వయసులో ఉన్న వారు ఇందులో చేరచ్చు. పాలసీదారుడు మరణిస్తే రూ.2 లక్షలు నామినీ లేదా కుటుంబ సభ్యులకు ఇస్తారు. దీని కోసం మీరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి అప్లై చేసుకోవాలి. ఈజీగానే పాలసీ మీరు పొందొచ్చు.