ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. నిన్న రాత్రి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ మీద పోలీసులు దాడికి నిరసనగా ఈరోజు చలో ప్రగతి భవన్ ఈ కార్యక్రమానికి బీజీపీ అనుబంధ స్టూడెంట్ విభాగాలు ఏబీవీపీ అలానే బీజేవైఎం పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే ప్రగతిభవన్ పరిసరాల్లో వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు.

బిజెపి నిరసనలకి పిలుపినిచ్చిన నేపధ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా పోలీసులు మోహరించినట్టు ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం. ఇక అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ వద్ద కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు, అక్కడికి కూడా నిరసనకారులు వచ్చి తమ నిరసన తెలియజేసే అవకాశం ఉండటంతో పోలీసులు అక్కడ కూడా మోహరించారు. ఇక ఈరోజు బిజెపి నేతలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అలానే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను కలిసి పోలీసుల వైఖరి మీద ఫిర్యాదు చేయనున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version