బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై స్పందించాడు నటుడు ప్రకాశ్ రాజ్. నేను చేసిన యాడ్ గురించి చర్చ జరుగుతుందని తెలిసింది. 2016లో ఆ యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను ఆ యాడ్ చేసిన మాట నిజం. అయితే ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా.. 2017లో ఒప్పందం పొడిగిస్తామని అడిగారు. కానీ నేను ఆ యాడ్ ను ప్రసారం చేయవద్దని కోరాను. 9 ఏళ్ల కిందట ఏడాది ఒప్పందంతో ఆ యాడ్ చేశాను.
కానీ నేను ఇప్పుడు ఏ గేమింగ్ యాప్ లకు ప్రచారకర్తగా పనిచేయడం లేదు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు. ఒప్పందం తర్వాత నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపాను. కానీ ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు. నేను చేసిన యాడ్ పై పోలీసులకు వివరణ ఇస్తాను అని ప్రకాష్ రాజ్ అన్నాడు.