MAA ELECTIONS : మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు

-

మా అసోషియేషన్‌ ఎన్నికలు వాడివేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు ఆసక్తిగా మారుతున్నారు. ఇక ఇటీవలే.. మా అసోషియేషన్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. మంచు విష్ణు ప్యానల్‌ మరియు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు తమ, తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఎన్నికల తేదీ తరుముకొస్తున్న తరుణంలో.. ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకుంటున్నారు.

ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా నటుడు మంచు విష్ణు పై ప్రకాశ్‌ రాజ్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు ప్యానెల్ పై ఎన్నికల సహాయ అధికారి నారాయణ రావుకి ఫిర్యాదు చేశారు ప్రకాశ్ రాజ్. శ్రీకాంత్ , జీవిత రాజశేఖర్ తో వచ్చి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు ప్రకాశ్ రాజ్. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో వారికి అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించు కుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. వెంటనే మంచు విష్ణును ప్యానెల్‌ ను డిస్‌ మిస్‌ చేయాలని ఫిర్యాదు లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version