రాజకీయాలకు, సినిమాలకు ఏనలేని బంధం ఉంది. ఇప్పటికే పలువురు సినిమా తారాలు రాజకీయాల్లో ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా సమాజ హితం కోసం తాను రాజకీయాల్లోకి వస్తానంటూ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తీసుకున్న నిర్ణయానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మద్దతు ప్రకటించారు. బుధవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కేటీఆర్‌ను కలిసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ చేస్తాన ప్రకాశ్ రాజ్ తెలపడంతో కేటీఆర్ ఆయనకు అభినందనలు తెలియజేస్తూ రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షించారు. గత నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ధైర్యంగా సినీ పరిశ్రమ నుంచి ముందుకొచ్చి తమకు మద్దతు ఇచ్చినందుకు ప్రకాశ్‌రాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…. నిర్మాణాత్మకంగా, నిక్కచ్చిగా వ్యవహరించే ప్రకాశ్‌రాజ్ లాంటి వ్యక్తులు ప్రస్తుతం రాజకీయాలకు అవసరమని, వారితోనే ప్రక్షాళన సాధ్యమన్నారు. అనంతరం ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. కేటీఆర్ మద్దతు తన రాజకీయ ప్రవేశానికి స్ఫూర్తినిచ్చిందంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో
స్వార్థపరమైన రాజకీయాలు పెరిగిపోయాయన్నారు. తెలంగాణలో తెరాస పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటూ పొగిడారు. అయితే ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రామన్న (కేటీఆర్) మద్దతుంటే..ఇక ప్రకాశ్ రాజ్ గెలుపు నల్లేరుమీద నడకలాంటిదే అంటూ ఆయనకు అభినందనలు తెలిపారు.