ఇప్పుడు చూపించి ఏం లాభం..!

-

తెలుగు హీరోయిన్ గా తెలుగు, తమిళ సినిమాల్లో రాణించిన స్వాతి ముందు బుల్లితెర మీద కలర్స్ స్వాతిగా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి సినిమాలు చేసింది. కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నా సరైన ఫలితాలు అందుకోని స్వాతి లాస్ట్ ఇయర్ సినిమాలను ఆపేసి వికాస్ అనే పైలెట్ ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత వికాస్ తో ఇండోనేషియాలో ఉంటుంది స్వాతి.

న్యూ ఇయర్ గిఫ్ట్ గా స్వాతి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఓ ప్రముఖ ఛానెల్ వారిని ఇండోనేషియా పిలిపించుకుని మరి ఈ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు తెలుస్తుంది. మారీడ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉందని తన భర్త తనని బాగా అర్ధం చేసుకున్నాడని చెప్పిన స్వాతి ఇంటర్వ్యూ మధ్యలో బికినితో షాక్ ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో బికినితో కూడా ఇంటర్వ్యూ కొనసాగించింది స్వాతి.

పెళ్లికి ముందు గ్లామర్ షోకి ఆమడ దూరంగా ఉన్న స్వాతి పెళ్లి తర్వాత ఈ రెచ్చిపోవడం అందరిని అవాక్కయేలా చేస్తుంది. మరి ఈ చూపించేది ఏదో పెళ్లికి ముందు చూపించినా కాస్త లాభం ఉనేడి. ఆఫ్టర్ మ్యారేజ్ ఎంత చేసినా వేస్ట్ అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version