Swiss Open : స్వీస్ ఓపెన్‌లో నిరాశపర్చిన ప్ర‌ణ‌య్.. ఫైన‌ల్‌లో ఓట‌మి

-

స్వీస్ ఓపెన్ సూప‌ర్ 300 బ్యాడ్మింట‌న్ టోర్నీ ముగిసింది. ఈ టోర్నీ లో ఉమెన్స్ విభాగంలో భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవీ సింధు గెలుపొందింన విషయం తెలిసిందే. కాగ మెన్స్ విభాగంలో భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు ప్ర‌ణ‌య్ కూడా నేడు ఫైన‌ల్ ఆడాడు. అయితే స్వీస్ ఓపెన్ ఫైన‌ల్ మ్యాచ్ లో ప్ర‌ణ‌య్ ఘోర‌మైన ఓట‌మిని ఎదుర్కొన్నాడు. స్వీస్ ఓపెన్ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త్ బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు ప్ర‌ణ‌య్.. ఇండోనేసియా దేశానికి చెందిన జొనాథ‌న్ క్రిస్టీ తో త‌ల‌ప‌డ్డాడు.

అయితే ఈ మ్యాచ్ లో ప్ర‌ణ‌య్ వ‌రుస రెండు సెట్ల‌లో ఓట‌మి పాల‌య్యాడు. 21 – 12, 21 – 18 రెండు వ‌రుస సెట్ల‌ల్లో ప్ర‌ణ‌య్ ఓడిపోయాడు. దీంతో స్వీస్ ఓపెన్ లో ప్ర‌ణ‌య్ పోరాటం ఆగిపోయింది. ఈ స్వీస్ ఓపెన్ సూప‌ర్ 300 లోని మెన్స్ విభాగంలో ప్ర‌ణయ్ ర‌న్న‌ర‌ప్ గా నిలిచాడు. అయితే స్వీస్ ఓపెన్ లో భార‌త్ ఇప్ప‌టికే బోణి కొట్టింది. ఓలంపిక్ మెడ‌ల్ విజేత పీవీ సింధు స్వీస్ ఓపెన్ విజేతగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news