జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి లో వృదురాలు దారుణ హత్యకు గురైంది. ఆ మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి బావిలో పడేశారు దుండగులు. మృతురాలు బోయినపల్లి కి చెందిన సూరపాక వీరమ్మగా (65) గుర్తించారు పోలీసులు. బంగారం కోసమే వృద్ధురాలిని హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.

వీరమ్మ ఒంటిపై ఆభరణాలు ధరించిన చోట్ల కత్తి గాయాల ఆనవాళ్లు ఉన్నాయి. ఈనెల 19న బోయినపల్లి నుంచి గర్మిళ్లపల్లి కి వెళ్లింది సూరపాక వీరమ్మ. ఇక 19తేది నుంచి కనిపించకుండా పోయింది వృద్ధురాలు వీరమ్మ. ఈ తరుణంలోనే… వీరమ్మ కోసం ఐదు రోజులుగా వెతికారు కుటుంబసభ్యులు, బంధువులు. ఇక ఈ రోజు గర్మిళ్లపల్లి శివారు బావిలో వీరమ్మ మృతదేహం లభ్యం అయింది. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.