మొత్తానికి టీఆర్ఎస్, ప్రశాంత్ కిశోర్ మధ్య బంధంపై ఓ క్లారిటీ వచ్చింది. ఊహాగానాలకు తెరదించుతూ.. అందరి శషభిషలకు సమాధానం అన్నట్లుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. పీకే నేతృత్వంలోని ఐ ప్యాక్ తో తమ ఒప్పందం కొనసాగుతుందని చెప్పారు. ఈ డిజిటల్ యుగంలో యవతను దూరం చేసుకోవద్దనే ఉద్దేశంతోనే తాము ఆ బంధాన్ని కొనసాగించాలని, 2023 వరకు తమ పొత్తు కొనసాగుతుందని చెప్పారు.మొత్తానికి కాంగ్రెస్ లో పీకే చేరినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ కు కూడా పీకే టెన్షన్ తప్పింది. ఇప్పటి వరకు ఆ పార్టీ శ్రేణుల్లో ఓ డైలమా నెలకొంది. తమ పార్టీలో చేరిన వ్యక్తి టీఆర్ఎస్‌కు ఎలా పని చేస్తారని? ఆందోళన చెందారు. ఇది పార్టీని దెబ్బతీయదా? తామేమో టీఆర్ఎస్‌పై జీవన్మరణ సమస్యలా పోరాడుతుంటే.. ఈ పీకే వ్యవహారం నీరుగార్చేలా ఉందని ఆలోచనలో పడేలా చేసింది.
కేటీఆర్ ప్రకటనతో పార్టీ నేతల్లో ఏర్పడే భయాందోళనను తొలగించేందుకు మంచి అవకాశం దొరికింది. ఇంకా ఎవరైనా విమర్శలు చేస్తే.. గతంలో ఓవైసీ కుటుంబానికి న్యాయవాదిగా పని చేసిన రఘునందన్ రావు ఇప్పుడు బీజేపీలో ఎమ్మెల్యే కాలేదా? అని ఎదురుదాడికి దిగొచ్చు. మొత్తంగా తమను తాము డిఫెన్స్ చేసుకునేందుకు అటు టీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు చాన్స్ దక్కింది.
ఇదంతా పక్కన పెడితే.. పీకేతో ఒప్పందానికి టీఆర్ఎస్ ఎందుకు అంతలా తహతహలాడుతోందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రాజకీయ నేతలే కాదు…కాస్త రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా ఈ ప్రశ్న మనసులో రాచపుండులా తొలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో అప్రతిహతంగా సాగిన కేసీఆర్.. ఎందుకు వచ్చే ఎన్నికలపై ఇంతలా భయపడుతున్నారు.? బీజేపీ బలపడిందని అనుకుంటున్నారా? కాంగ్రెస్ తో ముప్పు తప్పదని భావిస్తున్నారా? తన చరిష్మా తగ్గిందని గుర్తించారా? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని అనుకుంటున్నారా?
ఓటమి భయం పట్టుకుందా? కొన్ని విధానాలను, పథకాలను ప్రజలు ఆమోదించినా కొన్ని అంశాల్లో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని గుర్తించారా? నీళ్లు, నియామకాలు, నిధుల నినాదంలో.. నీళ్ల సమస్య తీరినా.. ఉద్యోగాల భర్తీ విషయంలో అసంతృప్తి తన పీఠానికి ఎసరు తేనుందని భావిస్తున్నారా? రెండు ఉప ఎన్నికలు, జీహెచ్ ఎంసీ ఎన్నికల ఫలితాలు కళ్లు తెరుచుకునేలా చేశాయా? ఇలాంటి యక్షప్రశ్నలెన్నో జనం మదిలో మెదులుతున్నాయి. ఏది ఏమయినా యుద్ధంలో గెలవడమే ముఖ్యం. అంతేకానీ.. ఏ పద్ధతులు అనుసరించామన్నది ముఖ్యంకాదన్నదే నేటి నీతిగా మారిన తరుణంలో ఎవరి వ్యూహాలనూ తప్పుపట్టేందుకు చాన్స్ లేదు. ఒప్పందాలను కూడా…