‘ అన్నా మీ సహాయం కావాలి ‘ వై ఎస్  జగన్ కి ప్రశాంత్ కిశోర్ అర్జెంట్ ఫోన్ ?

-

దేశంలోనే నెంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్తగా పేరు సంపాదించాడు ప్రశాంత్ కిషోర్. బీహార్ రాజకీయాలలో జెడియు ఉపాధ్యక్షుడిగా రాణించిన ప్రశాంత్ కిషోర్…పార్టీ అధిష్టానం ఆలోచనలకు వ్యతిరేకంగా నడుచుకోవటంతో పార్టీ నుండి అధ్యక్షుడు నితీష్ కుమార్ సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జేడీయూ మరియు కేంద్ర ప్రభుత్వం కలసి చేస్తున్న రాజకీయాలు ఎదుర్కోవడానికి ప్రశాంత్ కిషోర్ బీహార్ రాష్ట్రంలో తనదైన శైలిలో ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది యువతీ యువకుల అభిప్రాయాల్ని తెలుసుకోవడడం కోసం ఫిబ్రవరి 20న ప్రశాంత్‌ కిషోర్‌ ‘బాత్‌ బీహార్‌ కీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు 100 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటిస్తానని ఆయన అన్నారు. బీహార్‌ను వచ్చే 15 ఏళ్లలో దేశంలోని 10 గొప్ప రాష్ట్రాల్లో ఒకటిగా చేస్తానన్నారు. ఇటువంటి సమయంలో పీకే పై కేసు నమోదు కావటం ఆ రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ అయింది. పూర్తి విషయంలోకి వెళ్తే ఈ ఐడియా నాది ప్రశాంత్ కిషోర్ కాపీ చేసి బాత్ బీహార్ కీ అనే కార్యక్రమాన్ని తయారు చేశారని మోతీహారి కి చెందిన గౌతమ్ అనే యువకుడు  పీఎస్ లో ఫిర్యాదు చేశాడు.

 

తాను జనవరిలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెడితే, ప్రశాంత్ కిషోర్ ఫిబ్రవరిలో బాత్ బీహార్ కి కార్యక్రమాన్ని మొదలుపెట్టారని, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు అంట. జేడీయూ మరియు కేంద్రంలో ఉన్న బీజేపీ కలసి ప్రశాంతి కిషోర్ ని రాజకీయాల్లోనే లేకుండా చేయాలి అని గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఇటువంటి సమయంలో ఇటీవల కేంద్రం తో కొంచెం సఖ్యతగా కలసి అడుగులు వేస్తూ రాజకీయాల్లో రాణిస్తున్న వైయస్ జగన్ కి ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేసి ఈ కేసు విషయంలో అన్నా మీ సహాయం కావాలి అంటూ హెల్ప్ అడిగినట్లు వైసీపీ పార్టీలో వార్తలు వినపడుతున్నాయి. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవటానికి గల కారణాలలో పీకే ఒకరు అయినా నేపథ్యంలో పీకే హెల్ప్ అడిగినట్లు అర్థమవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version