FAU-G గేమ్‌కు ప్రీ రిజిస్ట్రేష‌న్లు షురూ.. గూగుల్ ప్లే స్టోర్‌లో లైవ్‌..

-

చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అనేక చైనా యాప్‌ల‌ను నిషేధించిన విష‌యం విదిత‌మే. వాటిల్లో ప్ర‌ముఖ మొబైల్ గేమ్ ప‌బ్‌జి మొబైల్ కూడా ఒక‌టి. అయితే ఈ గేమ్ బ్యాన్ అయ్యాక బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఆధ్వ‌ర్యంలో స‌రిగ్గా అలాంటి గేమ్‌నే రూపొందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. FAU-G పేరిట గేమ్‌ను డెవ‌ల‌ప్ చేసి అందుబాటులోకి తెస్తామ‌ని అన్నారు. ఇక ఈ గేమ్ అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుండగా ప్ర‌స్తుతం దీనికి సంబంధించి ప్రీ రిజిస్ట్రేష‌న్లు మొద‌ల‌య్యాయి.

FAU-G గేమ్‌కు గాను ఆ గేమ్ డెవ‌ల‌పింగ్ సంస్థ ఎన్‌కోర్ గేమ్స్ ప్రీ రిజిస్ట్రేష‌న్ల‌ను ప్రారంభించింది. ఆస‌క్తి ఉన్న వారు గేమ్ అందుబాటులోకి రాగానే ఆడేందుకు, ఆ విష‌యం తెలుసుకునేందుకు గేమ్ కోసం ప్రీ రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతానికి గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్ర‌మే ప్రీ రిజిస్ట్రేష‌న్ల‌ను స్వీక‌రిస్తున్నారు. గేమ్ కోసం గేమింగ్ ప్రియులు రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. అయితే ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై కూడా త్వ‌ర‌లోనే రిజిస్ట్రేష‌న్ల‌ను ప్రారంభిస్తార‌ని స‌మాచారం.

అయితే FAU-G గేమ్‌కు గాను ప్రీ రిజిస్ట్రేష‌న్ల‌ను అయితే ప్రారంభించారు కానీ గేమ్ ఎప్పుడు విడుద‌ల‌య్యేది వెల్ల‌డించ‌లేదు. సాధార‌ణంగా ప్రీ రిజిష్ట్రేష‌న్లు మొద‌ల‌య్యాక 10-15 రోజుల్లో ఏదైనా యాప్ లేదా గేమ్ వ‌స్తుంటాయి. అలాగే భావిస్తే మ‌రో రెండు వారాల్లో.. అంటే డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు FAU-G గేమ్ విడుద‌ల అవుతున్న‌ట్లు తెలుస్తుంది.

ఇక మ‌రోవైపు ప‌బ్‌జి కార్ప్ కూడా ప‌బ్‌జి మొబైల్ ఇండియా గేమ్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. మొన్నీ మ‌ధ్యే గేమ్ విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ విడుద‌ల కాలేదు. అందుకు కార‌ణాలు కూడా తెలియ‌లేదు. కానీ గేమ్ కు పేరు మార్చినా, స‌ర్వ‌ర్ల‌ను చేంజ్ చేసినా.. ప‌బ్‌జి మొబైల్ ఇండియాకు కేంద్ర ఐటీ శాఖ నుంచి ఇంకా అనుమ‌తి ల‌భించ‌లేదు. అందువ‌ల్లే ప‌బ్‌జి లాంచింగ్ ఆల‌స్యం అవుతున్నట్లు తెలిసింది. మ‌రి ఆ గేమ్ భార‌త్‌లో మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తుందో, లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version