ఉద్యోగం పోగానే నమ్మకం పోగొట్టుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి.

-

కరోనా తెచ్చిన లాక్డౌన్ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎందరో ఉపాధి కోల్పోయి ఏం చేయాలో తెలియని పరిస్థిత్తికి వచ్చారు. దీని కారణంగా ఆత్మవిశ్వాసం చాలా దెబ్బతింది. ఉద్యోగం పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. కొత్త ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేక తనని తాను అసహ్యించుకోవడం తన మీద తనకే ఒకరకమైన ఫీలింగ్ ఏర్పడడం మొదలైంది. తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

ఒక్కసారిగా జాబ్ పోవడం వల్ల అంతకుముందు ఫెయిల్యూర్స్ అన్నీ గుర్తొచ్చి నమ్మకాన్ని మరింత పలుచన చేస్తాయి. నమ్మకమే జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆత్మవిశాసం లేకపోతే అడుగు కూడా ముందుకు పడదు. అందుకే జీవితం ఆగిపోకుండా ఉండానికి నమ్మకాన్ని పెంచుకోవాల్సిందే. అందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి అంచనా వేయండి. మన చేతల్లో లేని దాని గురించి బాధపడడం తప్పు. ఉద్యోగం సాధించడానికి మీరెంత కృశ్ఃఇ చేసారో మీకు తెలుసు. అంతే కృషి మళ్ళీ చేయగలిగితే ఇక్కడ కాకపోతే మరోచోట ఉద్యోగం దొరకవచ్చు. ఇక్కడి దాకా వచ్చిన మీకు ఈ పరిస్థితి పెద్ద కష్టమేం కాదు. మిమ్మల్ని మీరు నమ్మండి.

ఆర్థికంగా తడబడటం పెద్ద సమస్యే. కానీ సమస్య వచ్చినపుడు సరైన ప్లానింగ్ ఏర్పర్చుకుంటే అందులో నుండి ఈజీగా బయటపడవచ్చు. ప్లాన్ చేసుకుని ప్రిపేర్ గా ఉండడి. అందులో నుండి బయటపడడం పెద్ద కష్టమేం కాదు.

మీరు సాధించిన విషయాలు గుర్తు చేసుకోండి. మీకు మీరే గొప్ప. అవతలి వాళ్ళతో పోల్చి చూసుకోకండి. మీరు సాధించిన విషయాలని గుర్తు తెచ్చుకుని అవి సాధించడానిమ్కి మీరెంత శ్రమించారో గుర్తు తెచ్చుకోండి. అప్పుడు చేసిన మీరు ఇప్పుడు ఎందుకు చేయలేరు ఆలోచించుకోండి.

రోజు వారి లక్ష్యాలను సిద్ధం చేసుకుని వాటిని అందుకోవడానికి ఇష్టపడండి. అందుకోలేక పోయినా మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు. ఇదేం సినిమా కాదు అనుకున్నవన్నీ జరిగిపోవడానికి. నమ్మకం కోల్పోకుండా ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు అనుకున్నది సాధించగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version