నిహారిక భర్తకు అలా.. బర్త్ డే విషెస్ చెప్పిన ప్రీతమ్ జుకల్కర్..!

-

మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక..సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. నెట్టింట ఆమె హల్ చల్ చేస్తుంటుంది. తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన భర్త చైతన్య జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా ఆమె తన పతికి డిఫరెంట్ గా బర్త్ డే విషెస్ చెప్పింది.

నిహారిక తన భర్తకు బర్త్ డే విషెస్ చెప్పడం సహజమే. కానీ, ఆ మాదిరిగానే విషెస్ సమంత స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ చెప్పడం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమవుతున్నది. ‘హ్యాపీ బర్త్ డే..మై కూలెస్ట్ కుకుంబర్..నేను ఎంత పిచ్చి పిచ్చి గా అల్లరి చేసినా ఓపికగా కామ్ గా ఉంటావ్..థాంక్స్.. ఐ లవ్ యూ బేబీ..’ అని ఇన్ స్టా వేదికగా పోస్టు పెట్టింది.

నిహారిక పోస్టుకు చైతన్య స్పందించాడు. ‘థాంక్యూ లవ్ ’ అని రిప్లయి ఇచ్చాడు. కాగా, సేమ్ అవే లైన్స్ ను ‘నిహాస్ కూలెస్ట్ కుకుంబర్’ అని పేర్కొంటూ ప్రీతమ్ జుకల్కర్ కూడా బర్త్ డే విషెస్ చెప్పాడు. అలా చెప్పడం ద్వారా ప్రీతమ్ టాలీవుడ్ సెలబ్రిటీలందరితో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాడా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

అసలు ప్రీతమ్ ఎవరినీ వదిలిపెట్టడా? అని అనుకుంటున్నారు. సమంత -నాగచైతన్య విడాకుల విషయంలో ప్రీతమ్ పాత్ర ఉందని వార్తలు రాగా, అప్పుడు ప్రీతమ్ జుకల్కర్ స్పందించిన సంగతి అందరికీ విదితమే. తాను సమంతను ‘అక్కా’ అని పిలుస్తానని ప్రీతమ్ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version