కేవలం రూ.500తో రూ.60 వేలకు పైగా ఆదాయం.. ఏం చేస్తుందో తెలుసా?

-

ఈ మధ్య జనాలకు తెలివి పెరిగి పోతుంది..ఆ అతి తెలివితోనే కొంతమంది డబ్బులను సంపాదిస్తున్నారు..ఓ అమ్మాయి చూయింగ్ నములుతూ వేలు సంపాదిస్తుంది..ఏంటి చూయింగ్ గమ్ నములుతూ డబ్బులు కూడా సంపాదించవచ్చునా..అదేలా అనే డౌట్ వస్తుంది కదా..అవును అండీ మీరు విన్నది అక్షరాల నిజం..దాని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

చూయింగ్ గమ్ నములుతూ బుడగలు ఊదుతుంటారు. బుడగలు ఎంత పెద్దగా వస్తే.. అంత హ్యాపీగా ఫీలవుతుంటారు. ఐతే ఆ బుడగలతో ఓ యువతి బిజినెస్ చేస్తోంది. వాటిని ఆన్‌లైన్‌లో అమ్ముకుంటూ భారీగా సంపాదిస్తోంది. బుడగలను అమ్ముకోవడమేంటని అనుకుంటారా? ఐతే బుడగలను నేరుగా అమ్మదు. వాటిని వీడియో తీసి.. యూట్యూబ్‌ లో పోస్ట్ చేస్తుంది. అలా యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేసి బాగా సంపాదిస్తోంది..జర్మనీకి చెందిన 30 ఏళ్ల జూలియా ఫోరాట్‌కు చూయింగ్ గమ్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ చూయింగ్ గమ్స్ నములుతుంటుంది. అది అలవాటుగా మారిపోయింది. ఐతే ఆ గమ్‌ను బాగా నమిలిన తర్వాత.. వాటితో బుడగలు ఊదుతుంది. ఏదో సరదాగా కోసం అలా చేసేది.

అయితే, ఓసారి ఆమె మిత్రుడు వాటిని చూసి ఫిదా అయ్యాడు. చూయింగ్ గమ్‌తో… అంత పెద్ద బుడగలు వస్తాయా? అని ఆశ్చర్యపోయాడు. వీటిని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే, భారీగా వ్యూస్ వస్తాయని,అలా డబ్బులు కూడా వస్తాయని చెప్పారు.దాంతో అతను అలానే చేశాడు.యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి.. అందులో వీడియోలు పోస్ట్ చేయడం ప్రారంభించింది. వారు అనుకున్నట్లుగానే.. తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వ్యూస్ బాగా రావడంతో, ఆదాయం కూడా పెరిగింది.అలా నెలకు 67 నుంచి 70 వేల ఆదాయం పొందుతూ హ్యాపీగా ఉన్నారు.

ఇది ఆమె పర్మినెంట్ జాబ్ కాదు. జూలియా ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజినీరింగ్, మార్కెటింగ్‌లో డిగ్రీలు ఉయి. ఐతే ఆమెకు చూయింగ్ గమ్‌తో బబుల్స్ ఊదడం చాలా ఇష్టం. అలా బబుల్స్ ఊదుతూ.. ప్రతి నెలా వేలల్లో సంపాదిస్తున్నారు జూలియా. సాధారణంగా ఆమె ఆన్‌లైన్‌లో 90 బబుల్‌గమ్స్ ఉండే ప్యాకెట్‌ను కొనుగోలు చేస్తుంది. ఒకేసారి 15-20 చూయింగ్ గమ్స్ నమలి.. వాటితో పెద్ద పెద్ద బుడగలను ఊదుతుంది.పెట్టుబడి లేదు. మార్కెటింగ్ లేదు. పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఆడుతూ పాడుతూనే.. నెలనెలా వేల రూపాయలను జూలియా సంపాదిస్తోంది. జూలియా చూయింగ్ గమ్స్ కొనడానికి కొనడానికి నెలకు 500 మాత్రమే ఖర్చు చేస్తూ 67 వేలు సంపాదిస్తూ అందరికి షాక్ ఇస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version