ప్రీతి కేసు నిందితుడు సైఫ్ రిమాండ్ పొడిగింపు

-

వరంగల్ మెడికల్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ సైఫ్ రిమాండ్ ని కోర్టు మరో 14 రోజులపాటు పొడిగించింది. 14 రోజుల రిమాండ్ ముగియడంతో డాక్టర్ సైఫ్ ని ఈరోజు మరోసారి కోర్టులో ప్రవేశపెట్టారు వరంగల్ పోలీసులు. ఈ నేపథ్యంలో సైఫ్ కి మరో 14 రోజుల రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మెజిస్ట్రేట్.

రిమాండ్ కోసం కోర్టుకు వస్తున్న సైఫ్ ని కోర్టు ప్రాంగణంలో కలిసే ప్రయత్నం చేశారు సైఫ్ తల్లి, సోదరి. కోర్టు ప్రాంగణంలో సైఫ్ ని చూసి ఒక్కసారిగా బోరున విలపించింది సైఫ్ తల్లి. తల్లిని, సోదరిని కోర్టు ప్రాంగణంలో చూడగానే భావోద్వేగానికి గురయ్యాడు సైఫ్. మరో 14 రోజులు రిమైండర్ పొడిగిస్తూ మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకోవడంతో సైఫ్ ని మళ్లీ ఖమ్మం జైలుకి తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version