బ్రేకప్ తర్వాత ఎక్స్‌ని ఎదుర్కొంటే ఈ టిప్స్ ను పాటించండి..!

-

ప్రతి ఒక్కరి జీవితంలో రిలేషన్షిప్ కు సంబంధించి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. చాలా సంవత్సరాలు కలిసి ఉన్నా సరే చిన్న చిన్న కారణాల వలన బ్రేకప్ వరకు వెళుతుంది. పైగా బ్రేకప్ తరువాత ఎదుర్కొనే సంఘటనలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యంగా బ్రేకప్ వలన మానసిక ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాకుండా తరువాత మాజీ లవర్ ను ఎదుర్కోవడం కూడా ఎంతో కష్టమే మరియు ఎన్నో ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడాలి. పైగా అటువంటి సందర్భంలో ఒత్తిడి, ఆందోళన వంటివి తప్పకుండా ఉంటాయి. కనుక బ్రేకప్ అయిన తర్వాత గతాన్ని మర్చిపోవడమే మేలు.

కాకపోతే త్వరగా మర్చిపోవడం సాధ్యం కాదు. కనుక బ్రేకప్ తర్వాత గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించాలి. కొంతమంది బ్రేకప్ అయిన తర్వాత మర్చిపోవడానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. మరికొందరు పనిలో సమయాన్ని గడుపుతూ గతాన్ని మర్చిపోవాలి అని గట్టిగా కోరుకుంటారు. ఇటువంటి జాగ్రత్తలను తీసుకోవడం వలన త్వరగా బయటపడతారు. ఇలా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఎక్కడైనా మాజీ లవర్ కనిపించినట్లయితే చాలా కష్టం అనే చెప్పాలి. అటువంటి సమయంలో ఏ విధంగా వ్యవహరించాలో కూడా అర్థం కాదు.

ఇలాంటి సందర్భం ఏర్పడినప్పుడు కోల్పోకుండా ఉండాలి మరియు గతం అంతా గుర్తు చేసుకోకుండా ప్రస్తుతం ఉండే క్షణాన్ని గుర్తు చేసుకోవాలి. వీలైనంతవరకు అటువంటి సందర్భం ఏర్పడినప్పుడు అక్కడ నుండి త్వరగా వెళ్లిపోవడం వంటివి చేయాలి. ఇలా చేయడం వలన ఒత్తిడికి గురవ్వకుండా ఉంటారు. దీంతో చాలా ప్రశాంతంగా ఉండవచ్చు. కొంత శాతం మంది బ్రేకప్ అయిన తర్వాత గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు బ్రేకప్ అయిన తర్వాత మీలో వచ్చిన మార్పులను ఎక్కువగా గమనించాలి. ఇలా చేయడం వలన మీరు తీసుకున్న నిర్ణయం సరైనది అని భావిస్తారు మరియు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news