సాధారణంగా కొంచెం హెల్దీగా ఉండే వాళ్ళు నలుగురిలో ఉన్నప్పుడు కాస్త సన్నగా, నాజుకుగా కనిపించాలని అనుకుంటుంటారు. అందులో అమ్మాయిలు మరీను. అయితే అందరి లో ఉన్నప్పుడు మీరు సన్నగా, నాజుకుగా, అందంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సింపుల్ టెక్నీక్స్ ని ఫాలో అవ్వండి. దీనితో మీరు అందరి కంటే సన్నగా, నాజుకుగా, అందంగా కనపడతారు. బాడీ ఇమేజ్ లో కాదు. వేసుకునే దుస్తుల్లో ఈ మార్పులు చేస్తే చాలు.
డార్క్ కలర్స్ లో సన్నగా, ఫిట్ గా కనిపిస్తారు కనుక బ్లాక్, బ్లూ, గ్రీన్, రెడ్ షేడ్స్ లో ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. ఫ్లోరల్స్, చెక్స్, ఏవైనా సరే ప్రింట్స్ ఉన్న దుస్తుల్ని ఎంచుకోండి. దీనితో ఇవి బాడీ మాస్ ని హైడ్ చేస్తాయి. వెర్టికల్ స్ట్రైప్స్ ని ఉపయోగిస్తే మరెంత పొడుగ్గా కనపడతారు. వాటిని పొట్టిగా ఉన్న వాళ్లు వేసుకుంటే మరెంత పొడుగ్గా కనపడతారు. కాబట్టి ఈ టిప్స్ ని అనుసరిస్తే మీరు స్లిమ్ గా, అందంగా కనపడతారు.