ఫోటో షూట్‌ కోసం.. ఎత్తైన జలపాతం అంచున.. ఆ మోడల్‌ సాహసమే..!

-

కొందరు మోడల్స్‌ ఫోటో షూట్‌ కోసం పడరాని పాట్లు పడుతుంటారు. శరీర ఆకృతిని మార్చుకునేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తూ స్లిమ్‌గా తయారవుతుంటారు. హెల్తీ డైట్‌ ఫాలో అవుతూ నానా తంటాలు పడుతుంటారు. మరికొందరు అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్‌ సర్జరీకి కూడా వెనుకాడరు. ఇంకొందరు తమ హోయలను చూపించుకోవడానికి ఫోటో షూట్‌లో తమ అందాలు కనిపించేందుకు మంచి లోకేషన్లను ఎంచుకుని ఫోటోలు దిగుతుంటారు. అలా దిగిన ఫోటోలను నెటిజన్లతో పంచుకుంటూ క్రేజ్‌ని పెంచుకుంటారు.

బికినీ ఫోటో షూట్‌ కోసం ఓ మోడల్‌ చేసిన సాహసం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మోడలింగ్‌ రంగంలో రాణించాలనుకునే చాలా మంది సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. విభిన్నమైన ఫోటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. పెన్సిల్వీనియాలోని పిట్స్‌బర్గ్‌కు చెందిన అమరీస్‌ రోజ్‌ (25) సాహసమే చేసిందని చెప్పుకోవచ్చు.

ఇంతకీ ఈ మోడల్‌ చేసిన పనేంటని ఆశ్చర్యపోతున్నారా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం చివరగా కూర్చొని ఫోటోకు ఫోజ్‌ ఇచ్చింది. దక్షిణాఫ్రికాలోని డెవిల్స్‌ పూల్‌గా పేరొందిన విక్టోరియా ఫాల్స్‌ అంచున బికినీతో ఫోటో షూట్‌కు సాహసించింది. సుమారు 1650 అడుగుల ఎత్తులో ఉండే ఈ జలపాతం నుంచి కిందపడితే శవం కూడా దొరకడం కష్టం. అలాంటి రోజ్‌ అవేవీ పట్టించుకోకుండా ఫోటోలకు ఫోజ్‌ ఇవ్వడం.. అది కాస్త తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసుకోవడంతో నెటిజన్లు పలు విమర్శలు చేస్తున్నారు.

జలపాతం చివరన నీటి ప్రవాహ వేగానికి కొంచెం బ్యాలెన్స్‌ తప్పినా ప్రాణాలు పోతాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఫోలోవర్లను పెంచుకోవడానికి ప్రాణాలతో చెలగాటం ఆడోద్దంటూ సలహా ఇస్తున్నారు. ఇలాంటి సాహసాలతో యువత తప్పుదోవ పడే ప్రమాదం ఉందని.. నీ వల్ల వేరే వాళ్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నెటిజన్లలో తిట్టేవారు తిడుతున్నా.. ఆమె సాహసాన్ని మెచ్చుకున్న వాళ్లు మాత్రం ఒక్క లైక్‌ కిట్టి.. ఆమెలో ఉత్సాహాన్ని పెంచుతున్నారు. మోడలింగ్‌ అవ్వాలనే ఆమె తాపత్రయాన్ని చూసి మెచ్చుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version