గర్భిణీలూ వీటికి దూరంగా వుండండి…మిస్ క్యారేజ్ అయ్యే ప్రమాదం వుంది..!

-

గర్భిణీలు తొమ్మిది నెలలు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పోషకాహారం తీసుకోవడం, సమయానికి మందులు వేసుకోవడం స్కానింగ్స్ ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యం. ఎన్నో కాంప్లికేషన్స్ ని గర్భిణీ స్త్రీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చాలా మంది గర్భిణులు ఆహారం విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పులు చేస్తే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి ఆ తప్పులు గురించి ఇప్పుడు చూద్దాం.

 

కాఫీ:

గర్భిణీ స్త్రీలు కాఫీకి దూరంగా ఉండాలి. చాలా మంది ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగుతూ ఉంటారు కానీ కాఫీని తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. సాధారణంగా గర్భిణీ స్త్రీలకు బీపీ ఎక్కువగా ఉంటుంది అటువంటప్పుడు కాఫీ తీసుకోకూడదు కాబట్టి గర్భిణీ స్త్రీలు కాఫీకి దూరంగా ఉంటే మంచిది.

బొప్పాయి పండు:

బొప్పాయి పండు తినడం వల్ల మిస్ క్యారేజ్ అయ్యే ప్రమాదం ఉంది. బొప్పాయి తొక్కలు, గింజలు కూడా ప్రమాదకరమే. కనుక గర్భిణీ స్త్రీలు బొప్పాయి కి దూరంగా ఉండాలి.

బెల్లం:

బెల్లం కూడా గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు. మొదటి ట్రైమిస్టర్ మరియు ఆఖరి ట్రైమిస్టర్లో అస్సలు తీసుకోకూడదు. అతిగా బెల్లం ను తీసుకోవడం వల్ల మిస్ క్యారేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

చేప మరియు పుట్టగొడుగులు:

చేపలను పుట్టగొడుగులను కూడా గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు వీటివల్ల కూడా గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. చేప మరియు పుట్టగొడుగులు ఫుడ్ పాయిజన్ కు దారితీస్తాయి,

పచ్చి ఆహారపదార్ధాలు:

పచ్చి ఆహార పదార్థాలను కూడా తీసుకోకూడదు. ఆకుకూరల్ని పచ్చిగా తినడం లాంటివి చేయకూడదు అతిగా వీటిని తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version