25 మండలాలలో పంట నష్డం జరిగినట్లు ప్రాధమిక అంచనా – మంత్రి చెల్లుబోయిన

-

ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాలపై సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. వారం రోజులలో పంట నష్టపరిహారంపై ప్రాధమిక అంచనా ఇవ్వాలని కలెక్టర్లని సిఎం ఆదేశించారు. సమీక్ష అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ.. రైతులు సంతోషంగా ఉన్న సమయంలో అకాల వర్షాలు రావడం దురదృష్టకరం అన్నారు.

ఎన్టీఆర్ జిల్లా, కర్నూలు, పార్వతీపురం, ప్రకాశం, మన్యం‌ తదితర జిల్లాలలో వరి, మొక్కజొన్న, అరటి, మినుము, పత్తి పంటలు నష్టపోయినట్లు తెలుస్తోందన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో 15, ఎన్టీఆర్ జిల్లాలో 5, కర్నూలులో 1, మన్యం జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 1…మొత్తంగా 25 మండలాలలో పంట నష్డం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేశామన్నారు మంత్రి చెల్లుబోయిన.

Read more RELATED
Recommended to you

Exit mobile version