ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు చేతికి అందని పార్టీ వైసీపీ మాత్రమేనని… మాజీ మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. వ్యవసాయ విద్యుత్ రంగం చరిత్రలో చంద్రబాబు కూడా ఉంటాడు.. బషీర్ బాగ్ లో రైతులను కాల్చి చంపింది ఎవరు? అని నిలదీశారు. నిడదవోలు కాల్దరి గ్రామంలో రైలు పట్టాల పై ధర్నా చేస్తున్న రైతుల పై కాల్పులు జరిపితే ఇద్దరు రైతులు చనిపోయారని… ఏలూరు కలెక్టరేట్ లో రైతుల పై లాఠీ ఛార్జీ చేయించారని మండిపడ్డారు. హైదరాబాద్ లో రైతులను గుర్రాలతో తొక్కించారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ అమలు చేసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నాయని… విద్యుత్ బిల్లులు కట్టలేదని మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో రైతులను సంకెళ్లు వేసి వ్యానుల్లో తరలించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. రైతులను రోజుల తరబడి జైళ్ళల్లో పెట్టించాడు చంద్రబాబు.. పార్టీలు మారటం గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పార్టీ లేదు బొక్కా లేదు అన్న వ్యక్తి అచ్చెన్నాయుడు అని… చంద్రబాబు పుట్టుక కాంగ్రెస్ అని…
టీడీపీలో చేరి మామ నుంచి పార్టీని లాక్కున్నాడని ఆగ్రహించారు.