మహారాష్ట్రలో కరోనా కేసుల విషయంలో కేంద్రం సీరియస్ గా ఉందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. దేశ వ్యాప్తంగా కరోనా ఇప్పుడు విలయతాండవం చేస్తుంటే మహారాష్ట్రలో పరిస్థితి ఊహకు కూడా అందని విధంగా ఉంది అనే విషయం అర్ధమవుతుంది. దీనికి కారణం అక్కడి ప్రభుత్వానికి నిర్వహణ అనేది తెలియకపోవడమే. కరోనా వైరస్ ని చాలా తక్కువగా అంచనా వేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.
ఆ రాష్ట్రంలో నమోదు అవుతున్న కేసులను ఇప్పుడు ఇటలీ నగరం మిలాన్ తో పోలుస్తున్నారు కొందరు. పరిస్థితి చాలా ఆందోళన గా ఉంది అక్కడ. మరణాల్లో దాదాపు 40 శాతం అక్కడే నమోదు అవుతున్నాయి. కరోనా రోగులను ఒక చోట నుంచి మరో చోటకు తీసుకుని వెళ్ళడం, అక్కడ కనీస జాగ్రత్తలను కూడా వాళ్ళు పాటించకపోవడం తో పోలీసులకు కూడా ఇప్పుడు కరోనా ఎక్కువగా సోకుతుంది.
ఆ రాష్ట్రంలో వైద్యులకు కూడా కరోనా వైరస్ సోకింది. దీనితో ఇప్పుడు అవసరం అయితే కరోనా కట్టడికి మహారాష్ట్రలో రాష్ట్ర పతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. కేంద్రం ఆధీనం లోనే ముంబై నగరం ఉంది పూర్తిగా కేంద్ర బలగాలను దింపే ఆలోచనలో కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం.