గంటా రాజీనామా దెబ్బ..వారి మీద పెరుగుతున్న ప్రెజర్ !

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఆందోళన చేస్తున్న కార్మికులకు అన్ని పార్టీలు బాసటగా నిలుస్తున్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొట్ట మొదటిగా రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీద రాజకీయ నేతలు విమర్శలు తీవ్రమవుతున్నాయి. అయితే గంటా రాజీనామాతో మిగిలిన ప్రజా ప్రతినిధుల మీద ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే టీడీపీ మినహా వేరే పార్టీలకు చెందిన అందరూ ప్రజా ప్రతినిధులు గంటాను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆయన స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయలేదని దమ్ముంటే అలా చేయాలని సవాళ్లు విసురుతున్నారు. ఇక మరో పక్క స్టీల్ ప్లాంట్ బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వానిదేనని టిడిపి విమర్శిస్తోంది. అయితే బిజెపి నేతలు సైతం ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెబుతున్నారు. కేంద్ర పార్టీతో మాట్లాడి ఈ విషయంలో కచ్చితంగా కార్మికులకు అండగా నిలబడతామని వారు చెబుతున్నారు. గంటాకు కార్మికులు మద్దతు లభిస్తోంది తమ కోసం రాజీనామా చేసిన గంటాను వారు అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version