పరుగులు పెట్టిన వెండి… ఈరోజు ధరలు ఇలా…!

-

వెండి కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. వెండి ధరలు బాగా పెరిగి పోయాయి. వెండి సామాన్లు, పట్టీలు, కడియాలు ఇలా ఏం కొనాలని అనుకున్న సరే కాస్త ఆగడం మంచిది. ఎందుకు అంటే రేట్లు బాగా పెరిగి పోయాయి.

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… వెండి ధరలు పరుగులు తీసుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌ లో వెండి ధర శనివారం ఏకంగా రూ.1900 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,100కు చేరింది. ఒక్క తులం వెండి ధర దాదాపు రూ.760 వుంది. దీనితో వెండి కొనాలనుకునే వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు.

గ్లోబల్ మార్కెట్‌లో వెండి ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ వెండి రేటు పైకి చేరింది అని చెప్పచ్చు. ఇది ఇలా ఉండగా మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌ లో కూడా వెండి ధర దూసుకెళ్తోంది. వెండి ధర ఔన్స్‌కు 0.29 శాతం పెరుగుదల తో 27.55 డాలర్లకు ఎగసింది.

వెండి కి డిమాండ్ పెరిగింది. ఆభరణాల తయారీ కోసం కూడా వాడతారు. అందువల్ల వెండికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. వెండి ధరలపై గ్లోబల్ మార్కెట్ రేట్లు, డాలర్, అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులు కూడా ఇది పెరగడానికి కారణం అనే చెప్పొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version